నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 373వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇంచార్జీలు మిద్దె శివ ప్రసాద్, పృథ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను కొనియాడారు.

వక్తలు మాట్లాడుతూ మహారాష్ట్ర కేంద్రంగా శత్రువులకు అంతుచిక్కని సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానీయుడు శివాజీ మహారాజ్ అని తెలిపారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయి, తల్లి సంరక్షణలో పెరిగి గొప్ప రాజ్య పాలకుడిగా ఎదిగిన తీరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.

తన పాలనలో కుల–మత భేదాలు లేకుండా పరమత సహనంతో పాలన సాగించిన యోధుడని పేర్కొన్నారు. గెరిల్లా యుద్ధ విధానాన్ని ప్రవేశపెట్టిన గొప్ప చక్రవర్తిగా ఆయన పేరు చిరకాలం నిలిచిపోతుందని తెలిపారు. శివాజీ మహారాజ్‌ను ఒక మతానికి లేదా ఒక కులానికి పరిమితం చేయడాన్ని బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.

శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆయన ఆశయ సాధన కోసం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దాస్, కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ మునిస్వామి, అసెంబ్లీ అధ్యక్షులు మడుపు నాగేష్, బొల్లి కురుమయ్య, మహేష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.: ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *