నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ పి. సృజన తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నిపుణులైన వైద్య సేవలను అందించేందుకు ఈ ప్రత్యేక శిబిరం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులు గ్రామాలకే వచ్చి సేవలు అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. శిబిరంలో స్త్రీ వ్యాధి నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎముకలు మరియు కీళ్ల నిపుణులు, దంత వైద్యులు, కంటి వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు పాల్గొని రోగులను పరీక్షించనున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాధారణ ఆస్పత్రి నుంచి నిపుణులైన వైద్యులు వచ్చి రోగులకు సేవలు అందిస్తారని ఆమె తెలిపారు. శిబిరంలో భాగంగా రోగులకు అవసరమైన అన్ని రకాల రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అనంతరం తగిన చికిత్స అందించనున్నారు.
బిజినపల్లి మండల ప్రజలు ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ పి. సృజన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 9490927816, 9441628160 నంబర్లను సంప్రదించవచ్చు.: నేడు బిజినపల్లిలో మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *