ఈ వేడుకలు చెంచు జాతర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో చెంచు గిరిజనులు, భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. చెంచు పూజారుల ఆధ్వర్యంలో సనాతన సంప్రదాయాల ప్రకారం కల్యాణోత్సవం నిర్వహించగా, తప్పెట్లు–మేళతాళాల నడుమ ఊరేగింపుగా విగ్రహాల రాక జరిగింది. అనంతరం కల్యాణ కట్టపై సంప్రదాయబద్ధంగా స్వామివారి కల్యాణం ఘనంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ అమరేందర్ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు పెండ్లి కొడుకు తరఫున ఎదుర్కోళ్లు నిర్వహించగా, చెంచు పెద్దల సమక్షంలో వేడుకలు మరింత సందడిగా సాగాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, విద్యుత్, పరిశుభ్రత వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దర్శనం అనంతరం చెంచు పూజారులు శేష వస్త్రాలు బహుకరించగా, స్వామివారి జాతర భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది: నల్లమలలో భక్తిశ్రద్ధల మధ్య భ్రమరాంబ మల్లికార్జున స్వామి
