లింగాల మండలం సూరపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి పనులకు అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, తమిళనాడు రాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులు, నాగర్కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ గారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

* పాఠశాల తనిఖీ

తొలుత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ గారు, రంగినేని శ్రీనివాస్ రావు గారు సందర్శించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల అవసరాలను తెలుసుకున్నారు.

బస్సు షెల్టర్ భూమి పూజ

ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న బస్సు షెల్టర్కు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

* కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలపై చర్చించారు.

ప్రజల చెంతకు పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ గారికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.

2. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు

మండల పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ శేఖర్, మందంపూర్ డిప్యూటీ సర్పంచ్ రవి, వెంకటేష్, తిరుపతయ్య, గబ్బురు గ్రామానికి చెందిన స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.: సూరపూర్ గ్రామంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటన – అభివృద్ధి పనులకు శ్రీకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *