కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, బీఆర్ఎస్ (TRS) పార్టీ నుంచి ఆరుగురు అభ్యర్థులు మొత్తం 7 నామినేషన్లు సమర్పించినట్లు వెల్లడించారు. అలాగే బహుజన ముక్తి పార్టీ (BMP) నుంచి ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున 3, 7, 9, 10, 11, 21 వార్డుల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 7, 17, 22 వార్డుల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
అదేవిధంగా 5వ వార్డు నుంచి బహుజన ముక్తి పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లు కమిషనర్ తెలిపారు.: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో నామినేషన్ల సందడి – తొలి రోజే 10 మంది 11 నామినేషన్లు దాఖలు

