అఖిలభారత రెడ్డి సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా తులసి రెడ్డి
కడప, జనవరి 30 అఖిలభారత రెడ్డి సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా అట్లూరు మండలం కుంభగిరి గ్రామానికి చెందిన దేవి రెడ్డి తులసి రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రం అందజేసి నియమించినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేండ్ల వెంకటసుబ్బారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో అఖిల భారత రెడ్డి సంఘం అభివృద్ధికి పాటుపడి కృషి చేయాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో యువజన విభాగాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు అనంతరం తులసి రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో యువజన విభాగాన్ని నియమించి బలోపేతం చేస్తానని అన్నారు నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేండ్ల వెంకటసుబ్బారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను: అఖిలభారత రెడ్డి సంఘం జిల్లా యువజన అధ్యక్షుడిగా తులసి రెడ్డి నియామకం
Read more: అఖిలభారత రెడ్డి సంఘం జిల్లా యువజన అధ్యక్షుడిగా తులసి రెడ్డి నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *