నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజున బీసీ సంఘాలు జనరల్ స్థానాలలో నిలబడిన బీసీ అభ్యర్థులను పార్టీలు ఏవైనాప్పటికీ భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్, బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి బీసీ నాయకులతో కలిసి పోటీలో నిలబడిన 18వ వార్డు పోతుల చంద్రకళ మరియు 19వ వార్డు కాటగౌడ్ సునీత అభ్యర్థులకు మద్దతిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్, బిసి నాయకులు వేముల సత్య శిలసాగర్, నిరంజన్ యాదవ్, లక్ష్మయ్య, కల్మూరు చిన్నయ్య, కొమ్ముల పెద్ద నిరంజన్, శాసాని శ్రీధర్ సాగర్, కల్మూరి శిరీష, గురుస్వామి, చిన్న నిరంజన్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.: బీసీలను భారీ మెజారిటీతో గెలిపించండి

