మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న అన్ని కమర్షియల్ సంస్థలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి తెలిపారు. పట్టణంలోని దుకాణ యజమానులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు, హాస్పిటల్స్, హోటల్స్ మరియు ఇతర వ్యాపార సంస్థలు మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ఆయన సూచించారు.

గడువు లోపు లైసెన్స్ తీసుకోని వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు లైసెన్స్ పొందని దుకాణాలపై 25 శాతం పెనాల్టీ విధించబడుతుందని తెలిపారు. అలాగే జూలై 1 నుంచి లైసెన్స్ తీసుకోని వ్యాపార సంస్థలపై 50 శాతం పెనాల్టీ విధించడమే కాకుండా అవసరమైతే షాపులను సీజ్ చేయడం కూడా జరుగుతుందని స్పష్టం చేశారు.

కావున పట్టణంలోని అన్ని దుకాణ యజమానులు ముందుకు వచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాల కోసం తిరుపతయ్య (9550942030) లేదా సతీష్ (9160000647)ను సంప్రదించాలని సూచించారు.: మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *