ఈ సందర్భంగా పరమశివునికి మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకాలు విశేష ద్రవ్యాలతో నిర్వహించారు. అలాగే మహానందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ చైర్మన్ గోపాలరావు దంపతులు, కంచే రాజేష్ దంపతులు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమటం విశ్వనాథ శాస్త్రి, ఆలయ అర్చకులు, భక్తులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్సవాలు భక్తి పరవశంలో కొనసాగుతున్నాయి.: నందివడ్డేమాన్‌లో వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం





