నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడుతోంది.

ఈ శిబిరంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి నుంచి నిపుణులైన వైద్యులు పాల్గొని సేవలు అందించనున్నారు. స్త్రీరోగ నిపుణులు, శిశు వైద్యులు, ఎముకలు-కీళ్ల నిపుణులు, దంత వైద్యులు, కంటి వైద్యులు మరియు జనరల్ ఫిజీషియన్లు ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా పరీక్షలు, చికిత్సలు అందించనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు నిపుణులైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైద్యుల సలహాలు, చికిత్సలు పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.: పాలెం పీహెచ్‌సీలో 25న మెగా ఉచిత వైద్య శిబిరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *