శ్రీ విశ్వవసు సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్ల పక్షం చవితి శనివారం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఘనంగా తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. శని గ్రహ దోష నివారణార్థం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, ఈ మాసంలో స్వామివారిని భక్తితో కొలిచిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన్మ రీత్యా, గోచార రీత్యా కలిగే శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని సూచించారు.
అదేవిధంగా ఆలయంలో పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చనలు నిర్వహించగా, అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు గవ్వమఠం శాంతికుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల్లో పాల్గొన్నారు.: ఘనంగా శనేశ్వర స్వామికి పూజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *