నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలకు మరో ఆరోగ్య సేవ అందుబాటులోకి రానుంది. ఈ నెల 25వ తేదీన జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయంలోని 102 గదిలో జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చే రోగులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరంలో రోగులకు సాధారణ కంటి పరీక్షలతో పాటు ప్రత్యేక కంటి పరీక్షలు కూడా చేపట్టనున్నారు. పరీక్షల్లో క్యాటరాక్టు పొర ఉన్నవారిని గుర్తించి, వారికి మహబూబ్‌నగర్ జిల్లా ఏనుగొండలోని లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అవసరమైన రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఏనుగొండకు తరలిస్తారని అధికారులు వివరించారు. శిబిరానికి వచ్చే రోగులు ముందుగానే బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని రిపోర్టులను వెంట తీసుకురావాలని సూచించారు.

అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీతో పాటు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440876556, 7386940480 నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.: 25న ఉచిత కంటి వైద్య శిబిరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *