ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శ్రీ ఫిరంగి గారు పాల్గొని కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ఎస్సీ సంఘాల ప్రతినిధులు, నాయకులు ఈ సమావేశంలో హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అంతేకాకుండా, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి, అందులో కోళ్లు శివను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లో విస్తరింపజేయడం, సామాజిక సమానత్వం కోసం కృషి చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. రాబోయే జయంతి వేడుకలను విజయవంతం చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.: నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నికలు



