ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని పాఠశాలకు స్వయంగా రంగులు వేసి సుందరీకరణ చేపట్టారు. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణను శుభ్రపరిచి పరిశుభ్రతపై సందేశం ఇచ్చారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
గ్రామంలోని రైతులు మరియు గ్రామస్తులకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు తృణధాన్యాలతో ప్రత్యేక వంటకాల తయారీ విధానాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. వండిన ఆహారంలో పోషకాలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వివరించారు. ఈ సందర్భంగా జొన్న అప్పాలు, రాగి లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, చిప్స్, మిల్లెట్ లడ్డు వంటి ఆరోగ్యకరమైన వంటకాలను ఎలా తయారు చేయాలో ప్రత్యక్షంగా చూపించారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను నిత్య ఆహారంలో భాగం చేసుకోవాలని విద్యార్థులు సూచించారు.
ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ అధికారులు ప్రొఫెసర్ ఎన్. నవత, వి. శ్రీరమ్య ఆధ్వర్యంలో నిర్వహించబడింది. విద్యార్థుల బృందం ఆకర్ష్, సుస్మిత, శంకర్, నిధి, స్వాతి, రామకృష్ణ, శరణ్య, పద్మజ, పూజిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. లెక్చరర్లు సందీప్, వైష్ణవి మరియు గ్రామస్తులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల సేవలను గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులు అభినందించారు.: ఇంద్రకల్ గ్రామంలో ఎన్ఎస్ఎస్ శిబిరం






