తనిఖీల సమయంలో యోగి రెస్టారెంట్‌లో గృహ వినియోగానికి ఇచ్చే LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని రెండు LPG గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై వంగూర్ పోలీస్ స్టేషన్‌లో Cr.No. 32/2026గా కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) మరియు Essential Commodities Act, 1955 – Section 7 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అధికారులు మాట్లాడుతూ గృహ వినియోగానికి ఇచ్చే LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇలాంటి అక్రమాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.: వంగూర్‌లో అక్రమ LPG గ్యాస్ వినియోగం బట్టబయలు
