నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు విజ్ఞాన–వినోద పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ శృతి ఒక ప్రకటనలో తెలిపారు.
పాఠశాల నాలుగో, ఐదో, ఆరవ తరగతులకు చెందిన విద్యార్థులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ముందుగా మహబూబ్‌నగర్‌లోని ప్రసిద్ధ పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియాన్ని సందర్శించి శాస్త్రీయ అంశాలపై అవగాహన పొందారు.
తర్వాత మయూరి పార్క్‌కు వెళ్లిన విద్యార్థులు అక్కడ వినోదాత్మకంగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు పర్యటన ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణ మరియు విజ్ఞాన సంబంధిత విషయాలపై వివరణ ఇచ్చారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ప్రాయోగిక జ్ఞానం, వినోదం అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి విద్యా పర్యటనలను నిర్వహిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.: పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన–వినోద పర్యటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *